Monday, January 20, 2025

సిద్దిపేటకు హరీష్ రావు ఎంఎల్ఎగా ఉండటం అదృష్టం: పద్మారావు గౌడ్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: దిష్టి తగిలేలా రాష్ట్రంలోనే ఎక్కడలేని విధంగా సిద్దిపేటలో గౌడ కులస్తులకు ఎసి కన్వెన్షన్ హాల్ నిర్మించినందుకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ తో కలిసి 6 కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన శ్రీ మహారేణుక ఎల్లమ్మ తల్లి గౌడ ఎసి కన్వీన్షన్ సెంటర్ ను రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రసంగించారు.

Also Read: సిద్దిపేటలో కొత్తది నేర్చుకొని వెళ్తాను: తలసాని

ఈ కన్వెన్షన్ సెంటర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమని, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కెసిఆర్ తో ప్రత్యేకంగా మాట్లాడి చెట్టు పన్ను రద్దు చేయించానని వివరించారు. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి మంత్రి తన్నీరు హరీష్ రావుతో పాల్గొంటూ ఆయన పనితీరు దగ్గరగా చూశానని పద్మారావు చెప్పారు. హైదరాబాద్ తర్వాత సిద్దిపేటలోనే అన్ని రకాల అభివృద్ధి కనబడుతుందని, హరీష్ రావు సిద్దిపేటకు ఎమ్మెల్యే గా ఉండడం ఇక్కడి ప్రజల అదృష్టమని ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ చైర్మన్ రోజా రాధాకృష్ణ శర్మ, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, మాజీ శాశనమండలి చైర్మన్ స్వామి గౌడ్, గీత పరిశ్రమిక సహకార కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్,పల్లె లక్ష్మణ్ గౌడ్, సిద్దిపేట జెడ్పిటిసి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News