మార్లవాయి మెడలో మరో మణిహారం
పద్మశ్రీ అవార్డుతో గిరిసీమలో సంబరాలు
గుస్సాడికళ ఔన్నత్యాన్ని చాటిన గోండు బిడ్డ
జైనూర్/అసిఫాబాద్: ఉమ్మడి తెలంగాణలో చారిత్రాత్మక గ్రామంగా పేరు గాంచిన మార్లవాయి మరోసారి జాతీయ వార్తల్లోకెక్కింది. గుస్సాడి రారాజుగా పేరు గాంచిన కనకరాజు పద్మశ్రీ అవార్డుకు ఎంపిక కావడంతో గిరిసీమ పులకించిపోయింది. దేశంలోనే ఆదివాసీ ప్రాంతం సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరుగా నిలిచింది. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని గుస్సాడి నృత్యం అతిప్రాచిన కళ కాగా అంతటి కళను జాతీయ స్థాయిలో తనదైన శైలిలో ప్రదర్శించి భవిష్యత్తు తరాలకు పునాధిగా నిలిచారు. కుమ్రంభీం జిల్లా జైనూర్ మండలం మార్లవాయి గోండు బిడ్డకు ఈ అరుదైన గౌరవం దక్కింది. దీంతో కుగ్రామం అయిన మార్లవాయి పేరు జాతీయ స్థాయిలో మారుమ్రోగుతుంది. అభివృద్దిలో అట్టడుగులో ఉన్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఆదివాసీల అభివృద్ధి ప్రణాళికలు సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన తదితర జాతీయస్థాయిలో వార్తలకు కేంద్ర బిందువుగా ఉన్నా మార్లవాయి గ్రామం అందరికి సుపరిచితమే అలాంటి గ్రామం నుండి ఒ సాధరణ ఆదివాసీ గుస్సాడి కళాకారుడికి పద్మశ్రీ అవార్డు దక్కడంతో అడవీ బిడ్డలు అనందడోలికల్లో మునిగితెలియాడుతున్నారు.
స్థానిక ఆశ్రమ వసతి గృహంలో చిన్నపాటి కుక్‌మెన్ విధులు నిర్వహిస్తున్న కనక రాజు ప్రాచిన సాంప్రదాయ కళ అయిన గుస్సాడి ప్రదర్శనలో కోత్తతరం యువకులకు శిక్షణ ఇస్తు అదర్శంగా నిలుస్తున్నారు. 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో అప్పటి రాష్ట్రపతి సమక్షంలో ఢిల్లీలోని ఎర్రకోటలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో కనకరాజు తన బృందంతో గుస్సాడి ప్రదర్శనలు చేసి ఆకట్టుకున్నారు.అదివాసిల అరాధ్యుడు వారి సంక్షేమానికి అవీరాళ కృషి చేసిన బ్రిటిష్ అధికారి హైమన్‌డార్ఫ్‌కు కనకరాజు అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఈయన చోరవతోనే అప్పట్లో 30ప్రాథమిక పాఠశాలలను ప్రారంభించారు. డార్ఫ్ హాయంలో ఆదివాసీలకు 47 వేల ఏకరాల పోడు భూమిని పంపిణి చేయగా సదరు మహా కార్యక్రమంలో కనక రాజు భాగం అయ్యారు. 1956లో గిరిజన సహాకార సంస్థ ప్రారంభించడానికి వెన్నుదన్నుగా నిలిచిన కనకరాజుకు కేంద్ర ప్రభుత్వం ఇంతటి పురస్కారం అందించడం పట్ల అడవీ బిడ్డలు సంబురాలు జరుపుకుంటున్నారు. ఊరుఊరంత అతన్ని ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. 80 ఎళ్ల వయస్సులోను కనకరాజు ఇప్పటికి గుస్సాడి కళను బ్రతికిస్తు ఇక్కడి వాసులకు గుస్సాడి రాజుగా సుపరిచితుడు.
కెటిఅర్, కవితల ప్రశంసల ట్వీట్లు
పద్మశ్రీ అవార్డు కనకరాజుకు టిఅర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల కెటిఅర్‌తో పాటు ఎమ్మెల్సీ కవితలు తన ట్వీట్టర్ ఖాతాలో శుభాకంక్షలు తెలిపారు. ఆదివాసీ సాంప్రదాయ గుస్సాడి నాట్యంతో ప్రావీణ్యం ఉన్న కుమ్రంభీం జిల్లా వాసి కనక రాజుకు అభినందనల ట్వీట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఉమ్మడి అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆదివాసీ బిడ్డ కనక రాజును ప్రశంసలతో ముంచేత్తుతున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కనక రాజును జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్‌రాజ్, జడ్పిచైర్‌పర్సన్ కోవలక్ష్మి, ఎమ్మెల్యే అత్రం సక్కు తదితరులు సన్మానించి శుభాకాంక్షలు తెలుపగా స్వగ్రామం అయిన మార్లవాయిలో అక్కడి సర్పంచ్ కనక ప్రతిభ వెంకటేశ్వర్‌రావు, ఎస్‌ఐ తిరుపతి గిరిజన సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున తరళివెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
Padma Shri award for Gussadi dance trainer Kanaka Raju