Monday, December 23, 2024

రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విశ్రాంత అధ్యాపకుడు ఆచార్య బి. రామకృష్ణారెడ్డికి పద్మశ్రీ అవార్డు రావటం ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైందని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్ యాదవ్ అభిప్రాయపడ్డారు. అక్టోజెనేరియన్ ప్రొఫెసర్ బి. రామకృష్ణారెడ్డికి భాషాశాస్త్రం, విద్యలో కృషి చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. తన దశాబ్దాల పట్టుదలతో గిరిజన, దక్షిణాది భాషలైన కువి, మందా, కుయి పరిరక్షణకు అపారమైన కృషి చేశారు.

గిరిజన భాషలను ఇతర భాషలతో అనుసంధానం చేయడంలో అవిశ్రాంతంగా కృషి చేశారు. భాషా శాస్త్రానికి పుస్తకాలు, పూర్తి స్థాయి నిఘంటువులను అందించాడు. పద్మ అవార్డుకు ఎంపికైన రామకృష్ణా రెడ్డిని ఒయు విసి ప్రొఫెసర్ దండెబోయిన రవిందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీ నారాయణ, ఓఎస్డీ ప్రొఫెసర్ బి. రెడ్యానాయక్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చింతా గణేష్ ఆయన నివాసంలో కలిశారు. పుష్పగుచ్చం, శాలువా, మెమెంటో తో ఘనంగా సత్కరించారు. 74వ గణతంత్ర దినోత్సవం ఓయూకు ప్రత్యేకంగా నిలిచిపోయిందని విసి ఆనందం వ్యక్తం చేశారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News