- Advertisement -
కుమురం భీం ఆసిఫాబాద్: గుస్సాడీ నృత్య కళాకారుడు, పద్మశ్రీ కనకరాజు(70) మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరుదైన కళాకారుడు కనకరాజు మరణం పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం.. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికారిక లాంఛనాలతో గుస్సాడీ కనకరాజు అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియల కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కాగా, ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయి గ్రామానికి చెందిన గుస్సాడీ కనకరాజు శుక్రవారం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈరోజు మర్లవాయిలో ఆదివాసీల సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆదివాసీల గుస్సాడీ నృత్యానికి గానూ 2021లో కనగరాజుకు కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ అవార్డుతో సత్కిరించింది.
- Advertisement -