- Advertisement -
ప్రముఖ ద్రుపద్ సంగీత కళాకారుడు లక్ష్మణ్ భట్ తైలాంగ్ కన్నుమూశారు. ఆయన వయసు 93 సంవత్సరాలు. తాజాగా కేంద్రప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు ఎంపికైనవారిలో లక్ష్మణ్ భట్ కూడా ఉన్నారు. అవార్డు అందుకోకుండానే ఆయన కన్నుమూయడం పట్ల సంగీత ప్రపంచం విషాదంలో మునిగిపోయింది.
వృద్ధాప్య సమస్యలతోపాటు న్యూమోనియో కూడా తోడు కావడంతో లక్ష్మణ్ భట్ జైపూర్ లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆయన కుమార్తె ప్రొఫెసర్ మధుభట్ తైలాంగ్ కూడా ద్రుపద్ గాయనే. లక్ష్మణ్ భట్ జైపూర్ లో అంతర్జాతీయ ద్రుపద్ ధామ్ ట్రస్టును ఏర్పాటుచేసి పేదలకు సాయం అందించారు.
- Advertisement -