Monday, December 23, 2024

పద్మశ్రీ గ్రహీతలకు ఇంటి స్థలం.. కోటి రూపాయలు

- Advertisement -
- Advertisement -

Padma Shri Ramachandraiah meets CM KCR

పద్మశ్రీ గ్రహీతలకు ఇంటి స్థలం.. కోటి రూపాయలు
పద్మశ్రీ సకిని రామచంద్రయ్య, కనకరాజుకు రివార్డు ప్రకటించిన ముఖ్యమంత్రి కెసిఆర్
మనతెలంగాణ/ హైదరాబాద్: పద్మశ్రీ అవార్డు గ్రహీత, డోలు వాయిద్యంలో ప్రత్యేక ప్రతిభను కనబరిచిన కళాకారుడు సకిని రామచంద్రయ్యకు తన స్థానిక జిల్లా కేంద్రం కొత్తగూడెంలో నివాసయోగ్యమైన ఇంటిస్థలం, నిర్మాణ ఖర్చుకు రూ.కోటి రూపాయల రివార్డును ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పద్మశ్రీ అవార్డును అందుకున్న నేపథ్యంలో సిఎం కెసిఆర్‌ను మంగళవారం ప్రగతి భవన్‌లో మర్యాదపూర్వకంగా రామచంద్రయ్య కలిశారు. అంతరించిపోతున్న ఆదివాసీ సాంస్కృతక కళను బతికిస్తున్నందుకు ఆయనను సిఎం అభినందించారు. తన జీవితకాలపు ప్రతిభకు గుర్తింపుగా ప్రతిష్టాత్మక పద్మశ్రీ అవార్డు ను పొందడం పట్ల సిఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య యోగ క్షేమాలను సిఎం కెసిఆర్ అడిగి తెలుసుకున్నారు. ఇంటి స్థలం, నిర్మాణానికి సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును సిఎం ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రులు హరీశ్ రావు, సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పువ్వాడ అజయ్‌కుమార్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, తాతామధు, ఎమ్మెల్యేలు జీవన్ రెడ్డి, మెత్కు ఆనంద్,గణేశ్ బిగాల, శ్రీనివాస్‌రెడ్డి తదితరులున్నారు.
పద్మశ్రీ కనక రాజుకు రివార్డు ప్రకటించిన సిఎం కెసిఆర్..
గతేడాది పద్మశ్రీ అవార్డు అందుకున్న గుస్సాడీ నృత్య కళాకారుడు కనకరాజుకు తన స్థానిక జిల్లా కేంద్రంలో నివాసయోగ్యమైన ఇంటి స్థలాన్ని, నిర్మాణం ఖర్చుల కోసం 1కోటి రూపాయలను సిఎం కెసిఆర్ ప్రకటించారు. ఇందుకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కును సిఎం కెసిఆర్ ఆదేశించారు.

Padma Shri Ramachandraiah meets CM KCR

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News