Thursday, January 23, 2025

నేడు కోరుట్లలో పద్మశాలి యుద్ధభేరి బహిరంగ సభ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో నేడు (ఆదివారం) జరిగే పద్మశాలి యుద్ధభేరి బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. శనివారం పద్మశాలి నేతలు మధ్యప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి నరహరి, రుద్ర శ్రీనివాస్, రామా శ్రీనివాస్, మార్త రమేష్, భోగ వెంకటేశ్వరతోపాటు ఇతర పద్మశాలి నాయకులు సభా వేదిక ఏర్పాటులను పరిశీలించారు.

ఈ సభకు దాదాపు లక్ష మంది వరకు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. వీరందరూ కూర్చోవడానికి కుర్చీలతో పాటు సభను వీక్షించేందుకు భారీ ఎల్‌ఈడి స్క్రీన్‌లను కూడా ఏర్పాట్లు చేశారు. లక్షల మంది హాజరయ్యే విధంగా ఏర్పాట్లను చేశారు. వర్షం వచ్చినా కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా వాటర్ ప్రూఫ్ సభా వేదికను ఏర్పాటు చేశారు. ఈ బహిరంగ సభకు రాజకీయాలకు అతీతంగా సభకు పెద్ద ఎత్తున్న పద్మశాలీలు తరలివస్తున్నారని ప్రతినిధులు వెల్లడించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News