Monday, January 20, 2025

పద్మశాలీలు రాజకీయ చైతన్యంతో ఐక్యతగా ముందుకు సాగాలి

- Advertisement -
- Advertisement -

సుల్తానాబాద్: పద్మశాలీలు రాజకీయ చైతన్యంతో ఐక్యతగా ముందుకు సాగాలని పద్మశాలి సంఘం పెద్దపల్లి జిల్లా ప్రధానకార్యదర్శి, మాజీ జడ్పీటీసీ అయిల రమేష్, జిల్లా ఉపాధ్యక్షుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరి మహేందర్‌లు అన్నారు. శుక్రవారం మండలంలోని తొగ్రరాయి గ్రామంలో పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు ఎన్నికల కమిటీ చైర్మన్ గుండ మురళి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పద్మశాలి కులస్తులు సభ్యులందరు పాల్గొన్నారు.

అనంతరం జరిగిన ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలు జరగగా తొగ్రరాయి గ్రామ శాఖ అధ్యక్షునిగా గుండ కొమురయ్యను కులస్తులందరు సభ్యుల సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధానకార్యదర్శిగా గుండా వెంకటేశం, ఉపాధ్యక్షులుగా గుండ మహేందర్, గుండ రమేష్, కోశాధికారిగా ఆడెపు సదయ్య, కార్యదర్శిగా ఆడెపు శ్రీనివాస్, తుమ్మ రమేష్, ప్రచార కార్యదర్శిగా ఆడెపు రామస్వామిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఈ కార్యక్రమంలో పద్మశాలి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు యాదగిరి, సుల్తానాబాద్ పట్టణ అధ్యక్షుడు ఆడెపు అంబదాస్, పేగడ పర్శరాములు, తుమ్మ లక్ష్మీనారాయణ, గుండ ప్రభాకర్, తుమ్మ శంకరయ్య, వార్డు మెంబర్ గుండ లక్ష్మీనారాయణ, ఎల్లె రాజ్‌కుమార్, గుండ వెంకటేశం, గుండా సతీష్, గుండా రామచంద్రం, గుండ సంపత్, గుండ రవీందర్, పెద్ద ఎత్తున పద్మశాలి కులస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతన పాలకవర్గానికి జిల్లా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News