Tuesday, January 7, 2025

హంస వాహనంపై సరస్వతి అలంకారంలో సిరుల‌త‌ల్లి

- Advertisement -
- Advertisement -

తిరుపతి: తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన శుక్ర‌వారం రాత్రి హంస వాహనంపై సరస్వతి అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. హంసకున్న విలక్షణ ప్రతిభ ఏమిటంటే పాల‌ను, నీటిని వేరు చేయగలగడం. అలాగే యోగిపుంగవులు కూడా జ్ఞానం, అజ్ఞానం తెలిసి మెలగుతారు. అలాంటి మహాయోగి పుంగవుల హృదయాలలో జ్ఞానస్వరూపిణియైన అలమేలుమంగ విహరిస్తూ ఉంటుంది. జ్ఞానార్జనకై సరస్వతీదేవిని ఉపాసించే సాధకులు ”హంసవాహన సంయుక్తా విద్యాదానకరీ మమ” అని ఆ తల్లిని ఆరాధిస్తారు.

వాహనసేవలో ఇఒ జె.శ్యామ‌ల‌రావు, జెఇఒ వీరబ్రహ్మం, గౌత‌మి, ఆలయ డీప్యూటీ ఇఒ గోవింద రాజన్, ఆలయ అర్చకులు బాబు స్వామి, టెంపుల్ ఇన్‌స్పెక్ట‌ర్లు సుభాష్, చ‌ల‌ప‌తి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News