Monday, November 25, 2024

ప్రముఖ సింగ‌ర్స్ ను టాలీవుడ్‌కు పరిచ‌యం చేసిన వ‌న్ అండ్ ఓన్లీ షో ‘పాడుతా తీయగా’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వ‌న్ అండ్ ఓన్లీ షో ‘పాడుతా తీయగా’ 30మందికి పైగా సింగ‌ర్స్ టాలీవుడ్‌కు పరిచ‌యం చేసింది. పాటల కార్యక్రమంలో సుధీర్ఘంగా నడిచిన షోగా పాడుతా తీయగా రికార్డులు సృష్టించింది. టివి రేటింగ్ లో పాడుతా తీయగా రికార్డుల సునామీ సృష్టించిన విషయం తెలిసిందే. ఎస్‌.పి.బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం హోస్ట్‌గా పాడుతా తీయగా ప్రారంభ‌మైంది. ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు ఎస్‌.పి.చ‌ర‌ణ్ ఆధ్వ‌ర్యంలో ఈ కార్యక్రమం మూడు పువ్వులు ఆరో కాయలుగా విరాజిల్లుతోంది. 1996లో ప్రారంభమైన ఈ సింగింగ్ షో ఎంతో మంది గాయ‌నీ గాయ‌కుల‌ను టాలీవుడ్ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేసింది. ఈయ‌న‌తో పాటు ఆస్కార్ అవార్డ్ గ్రహీత, ప్రముఖ పాటల రచయిత చంద్రబోస్, ప్రముఖ సింగర్లు సునీత, విజయ్ ప్రకాష్  ఈ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షోలో జడ్జిలు తమ సంగీత జ్ఞానాన్ని కంటెస్టెంట్లకు, ఆడియెన్స్‌కు పంచుతున్నారు. ఇప్పటి వరకు పాడుతా తీయగా షోలో 500కి పైగా కంటెస్టెంట్లు పాటలు విలపించారు.

Padutha theeyaga latest

పాడుతా తీయ‌గా ద్వారా ఇప్ప‌టివ‌ర‌కు 30కిపైగా సింగ‌ర్స్ టాలీవుడ్‌కు ప‌రిచయమయ్యారు. సింగ‌ర్ ఉషా, గోపిక పూర్ణిమ పాడుతా తీయ‌గా ద్వారానే వెలుగులోకి వ‌చ్చారు. ఉష తెలుగుతో పాటు ఇత‌ర భాష‌ల్లో క‌లిపి వెయ్యికిపైగా పాట‌లు పాడి మెప్పించారు. గోపిక పూర్ణిమ ఐదు వంద‌ల పాట‌లు పాడారు. మధురాతి మ‌ధుర‌మైన పాట‌ల‌తో మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పించిన కౌస‌ల్య కూడా పాడుతా తీయ‌గా ద్వారానే సింగ‌ర్‌గా టాలీవుడ్‌లోకి ప్రవేశించారు. సందీప్‌, పార్థు, రోహిత్, నిత్య సంతోషిణి, లిప్సిక‌, దామిని భ‌ట్ల‌, మ‌నీషా ఎర‌బ‌త్తిని, సాహితి చాగంటి, హ‌రిణి ఇవ‌టూరి, స్మిత‌, శ్రీల‌త కూడా పాడుతా తీయ‌గా ద్వారా మంచి పేరు ప్రఖ్యాతాలు తెచ్చుకొని సినిమాల్లో అవ‌కాశాలను ద‌క్కించుకున్నారు. సింగ‌ర్ హేమ‌చంద్ర కు కూడా పాడుతా తీయ‌గానే ద్వారానే సినిమాల్లో పాటలు పాడే అవకాశం సృష్టించుకున్నారు. తెలుగులో ఆయన ఎనిమిది వంద‌ల‌కుపైగా పాట‌లు పాడి ప్రేక్షకులను మెప్పించారు. టాలీవుడ్ లో టాప్ సింగ‌ర్స్‌ అనురాగ్ కుల‌క‌ర్ణి, మ‌ల్లిఖార్జున్‌లు పాడుతా తీయ‌గా ద్వారానే వెలుగొందారు. ఇండియ‌న్ ఐడ‌ల్ విన్న‌ర్ కారుణ్య కూడా పాడుతా తీయ‌గా ద్వారానే వెలుగులోకి వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News