Monday, December 23, 2024

పగిడిద్దరాజు పయనం

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం/గుండాల : తెలంగాణ కుంభ మేళా, ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతరగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మ క్క, సారలమ్మ జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. గత నెల రోజులుగా భక్తుల సందడితో సాగుతున్న జాతరలో గద్దెపై కొలువుదీరడానికి సమ్మక్క భర్త పగిడిద్దరాజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, గుండాల మండలం, యాపలగడ్డ గ్రామం నుంచి సోమవా రం పయనమయ్యారు. శతాబ్దాలుగా ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న ఆరెం వంశీయులు గర్భగుడి వద్ద పడగలు, శివసత్తులకు పురాతన కాలం నాటి ఆభరణాలు అలంకరించి పూజారు లు (వడ్డెలు) భుజాన మోస్తూ కాలినడకన మేడా రం బయలుదేరారు.

గిరిజన నృత్యాలు, కొమ్ము వాయిద్యాలు, డప్పుల కోలాటాల మధ్య ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించా రు. రెండు రోజుల పాటు జరిగే ఈ పాదయాత్రలో వరంగల్ జిల్లా, పూనుగొండ్ల పెనకం వంశీయులు లక్ష్మీపురం గ్రామం వద్ద కలుసుకుంటారు. జాతరకు ముందు రోజు జంపన్న వాగు వద్ద బస చేసి ఈ నెల 21 బుధవారం రోజున కొండాయిగూడెం నుంచి గోవిందరాజు, కన్నెపల్లి నుంచి సారలమ్మను ఆయా గ్రామ ప్రజలు తీసుకువచ్చి, ముగ్గురు వన దేవతలను మేడారం గర్భగుడిలో ప్రవేశపెడతారు. 22వ తేదీన సమ్మక్క దేవతను చిలకలగుట్ట నుంచి గద్దెల వద్దకు తీసుకువచ్చి అదేరోజు పగిడిద్దరాజుతో వివాహం జరిపిస్తారు. దీనిని గిరిజన భాషలో నాగవెల్లిగా అభివర్ణిస్తారు. దీంతో నిండు జాతర ప్రారంభమవుతుంది. సమ్మక్కను తిరిగి వనానికి తీసుకువెళ్లే క్రమంతో జాతర ముగుస్తుంది. ఆరెం వంశీయులు తిరిగి పగిడిద్దరాజును గుండాలకు చేర్చుతారు. అనంతరం ప్రతీ ఏటా నాగవెల్లి జాతరను తమ గ్రామంలో క్రమం తప్పకుండా నిర్వహిస్తామని వారు తెలిపారు. సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ రాజశేఖర్, వడ్డెలు , పూజారులు ఆరెం అప్పయ్య, బుచ్చయ్య, జోగయ్య, ఇద్దయ్య, లక్ష్మీనర్సు, చిన్న కాంతారావు, సత్యం, పెద్ద కాంతారావు, నాగేశ్వరరావు, సమ్మయ్య, నగేష్, చంద్రయ్య, బిక్షం రమేష్ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News