Wednesday, January 22, 2025

తుక్కుగూడలో మహిళా మృతదేహం కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలోని ఫహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తుక్కుగూడలో గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం సృష్టిస్తుంది. దుండగులు గోనె సంచిలో మహిళ మృతదేహం ప్యాకింగ్ చేసి పడేశారు. స్థానికులకు దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికుల సమాచారం మేరకు పహాడీ షరీఫ్ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. మూడు రోజుల క్రితం మహిళ మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మహిళపై రేప్ చేసి హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిస్సింగ్ కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News