Sunday, April 6, 2025

పహాడీషరీఫ్ ఇన్స్‌స్పెక్టర్ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భూవివాదాల్లో తలదూర్చిన పోలీసులను ఊపేక్షించమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు. భూవివాదంలో తలదూర్చిన పహాడీషరీఫ్ ఇన్స్‌స్పెక్టర్ సతీష్‌ను సస్పెండ్ చేస్తూ రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ కేసులో బాధితులు సిపి సుధీర్‌బాబుకు ఫిర్యాదు చేయడంఓ దర్యాప్తు చేయించారు. ఆరోపణలు నిజమని తేలడంతో ఇన్స్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేశారు. పోలీసు అధికారులు భూసంబంధ వివాదాల్లో తలదూర్చవద్దని ఎన్నిసార్లు ఆదేశించినా కొందరు అధికారులు వినడంలేదని పేర్కొన్నారు. వీరి వల్ల డిపార్ట్‌మెంట్‌కు చెడ్డపేరు తెస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించబోమని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News