Wednesday, April 23, 2025

వేటాడి వెంటాడి ఎపి వాసిని కాల్చి చంపి…. ఐడి కార్డు చూసి హైదరాబాద్ ఐబి ఆఫీసర్ ను కాల్చి చంపారు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్: దక్షిణ కాశ్మీర్‌లోని పహల్ గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నానికి చెందిన రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి చంద్రమౌళిని అతి దారుణంగా హత్య చేశారు. చంద్రమౌళి పారిపోతుండగా వేటాడి వెంటాడి కాల్చి చంపారు. ఏదైనా ఉంటే వెళ్లి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీకి చెప్పుకోవాలని చంద్రమౌళితో చెబుతూ అతడిపై తీవ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. మూడు గంటల తరువాత చంద్రమౌళి మృతదేహాన్ని పర్యాటకులు గుర్తించారు. సమాచారం తెలుసుకొని ఆయన కుటుంబ సభ్యులు పహల్‌గామ్‌కు బయలుదేరారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌లోని కోఠిలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని మనీశ్ రంజన్‌ను భార్య, పిల్లల ముందే కాల్చి చంపారు. ఐడి కార్డు చూసి మనీశ్‌ను కాల్చి చంపి భార్య, పిల్లలను వదిలేశారు. తీవ్రవాదుల దాడిలో 27 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News