Monday, December 23, 2024

కొనుగోలు చేసిన ధాన్యం డబ్బులను చెల్లించాలి

- Advertisement -
- Advertisement -

నాగిరెడ్డిపేట్ : వరి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేసిన డబ్బులను రైతుల ఖాతాల్లో వెంటనే జమా చేయాలని మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు డింమాండ్ చేశారు. గురువారం ధాన్యం డబ్బులు రైతుల ఖాతాల్లో జమా చేయాలని కోరుతు రైతులతో కలసి కాంగ్రేస్ నాయకులు, కార్యకర్తలు మండల కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. వడ్లు అమ్మిన డబ్బులు ఇంకా రైతుల చూతికి అందలేదని వచ్చే ఖరీఫ్‌కు విత్తనాలు ఎలా కొనుగోలు చేయాలని, పంట సాగుకు తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలని అన్నారు, ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులను జమా చేయాలని డిమాండ్ చేశారు.

వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఎకరాకు పది వేల చొప్పు ఇస్తామన్న హాయీ ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రంలో ఎంపిపి రాజుదాస్, లక్ష్మణ్, గోపాల్‌పేట్ ఉప సర్పంచ్ దుర్గేష్ తో పాటు రాకేష్, బోరంచ సాయిలు, రమేష్, పోసాని సాయిలు, రైతులు పాల్గొన్నారు. ధర్నా చేస్తున్న సమాచారం తెలుసుకున్న ఎస్సై ఆంజనేయులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ధర్నా చేస్తున్న వారిని సముదాయించి ట్రాఫిక్‌కు అంతారాయం కలగకుండా చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News