- Advertisement -
భువనగిరి బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి తనపై జరిగిన ఐటి దాడుల నేపథ్యంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మూడు రోజులు నా ఇంట్లో ఐటి సోదాలు జరిగాయని చెప్పారు. ఐటి అధికారులకు అన్ని రకాలుగా సహకరించానని ఆయన వెల్లడించారు. తన బంధువుల ఇళ్లలో ఐటి సోదాలు జరగలేదని పైళ్ల శేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షణాఫ్రికాలో గనులున్నాయనే ప్రచారం తప్పని ఆయన పేర్కొన్నారు. ఐటీ సోదాల వెనుక ఏ పార్టీ హస్తం ఉందో అందరికీ తెలుసని ఆరోపించారు.
- Advertisement -