Sunday, December 22, 2024

వ్యవసాయం దండగన్న చోట కెసిఆర్ పండుగ చేశారు: ఫైళ్ల

- Advertisement -
- Advertisement -

వ్వవసాయ రంగంలో దేశంలోనే అగ్రగామిగా తెలంగాణ రాష్ట్రం

మూడు గంటల పాలన మాకోద్దని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఖండించిన రైతులు

రైతులతో ఇష్టాగోష్టిలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డితో రైతుల మాట ముచ్చట్లు

మనతెలంగాణ/ యాదాద్రి భువనగిరి ప్రతినిధి: డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలని, టీచర్ కొడుకు టీచర్ కావాలని కోరుకుంటున్నా ప్రస్తుత పరిస్థితుల్లో సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతు కొడుకు కూడా రైతు కావాలని కోరుకుంటున్నారని భువనగిరి ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి పేర్కొన్నారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతు బంధు పేరుతో పెట్టుబడి సహాయం కింద ఎకరానికి పదివేలు, రైతు బీమా, ఇతర పథకాలతో నేడు వ్యవసాయం లాభసాటిగా మారడంతో రైతు కుటుంబం సంతోషంగా ఉందన్నారు. గతంలో దండగ అన్న వ్వవసాయమే నేడు పండుగలా మారిన వ్యవసాయం రైతులకు లాభసాటిగా మారిందని అన్నారు. సోమవారం భువనగిరి నియోజకవర్గంలోని బీబీనగర్ మండల కేంద్రంలోని బీబీనగర్ రైతు వేదిక క్లస్టర్ లో జరిగిన ‘ ప్రత్యేక సమావేశంలో రైతు సమస్యలపై ఇష్టాగోష్టి’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, రైతులతో మాట్లాడి వారి సమస్యలు, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

Also Read: చిరుతతో పోరాడిన రైతు… బైక్‌కు కట్టుకొని… వీడియో వైరల్

అనంతరం ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి మాట్లాడారు. దేశంలో వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని, సిఎం కెసిఆర్ నాయకత్వంలో రైతులకు ఉచిత విద్యుత్ అందిస్తు దండుగ అని అనుకున్న వ్వవసాయన్ని, లాభసాటిగా మార్చేందుకు కృషి చేశారని ఆయన పొగిడారు. రాష్ట్రం ఏర్పడక ముందు విద్యుత్‌ లేక రైతులు అనేక ఇక్కట్లు పడ్డారని, కరెంటు వచ్చిందంటే అన్నదాతలు తినే అన్నం విడిచిపెట్టి పొలానికి నీళ్లు పెట్టేందుకు వెళ్లేవారని గుర్తుచేశారు. నేడు హర్యానా, పంజాబ్, రాష్ట్రాల కంటే ఎక్కువగా పంటలు పండించే రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ముందుందని దీనికి కారణం సిఎం కెసిఆర్ ఇచ్చే 24 గంటల ఉచిత విద్యుత్, రైతు బంధు పథకం కింద పెట్టుబడి సహాయంతో రైతులు పంటలు, పండించి వ్యవసాయం రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ఫైళ్ల శేఖర్ రెడ్డి  మెచ్చుకున్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని, వ్వవసాయ రంగానికి 3 గంటల విద్యుత్ సరిపోతుందని అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బేషరతుగా రైతులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు తో తెలంగాణ రైతుల నడ్డి విరిచి ఆంధ్రా రాష్ట్రాన్ని కృష్ణా నీటిని తీసుకెళ్తే, తెలంగాణకు చుక్కనీరు లేని సమయంలో ఉచిత విద్యుత్ తో రైతులను ఆదుకున్న ప్రభుత్వం కెసిఆర్  ప్రభుత్వం అని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి గుర్తు చేశారు. అనంతరం రైతులందరు ముక్తకంఠంతో సిఎం కెసిఆర్ హయాంలోనే రైతులు అభివృద్ధి చెందుతున్నారని, మా రైతాంగం అంతా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తుందని, మూడు గంటల పాలన మాకోద్దని రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను రైతులంతా ఖండించారు. బేషరతుగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రైతులకు క్షమాపణ చెప్పాలని సమావేశంలో తీర్మానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News