టికెట్ కొన్న గంటల్లోనే రూ. 12 కోట్ల లాటరీ
కొట్టాయం ( కేరళ ) : అదృష్టలక్ష్మి ఎప్పుడు ఎవరిని వరిస్తుందో చెప్పలేం. రెక్కల కష్టంతో బతుకు గడుపుతున్న సామాన్య పెయింటర్ ఆదివారం ఒక్కసారి రూ.12 కోట్లను సాధించుకున్న కోటీశ్వరుడయ్యాడు. కేరళ లోని కొట్టాయంకు చెందిన సామాన్య పెయింటర్ సదానందన్‌కు క్రిస్మస్… నూతన సంవత్సర బంపర్ లాటరీలో రూ.12 కోట్లు గెలుచుకున్నాడు. తిరువనంతపురంలో ఆదివారం ఈ మెడా లాటరీ డ్రా తీశారు. డ్రా తీయడానికి కొద్ది గంటలకు ముందే సదానందన్ ( ఎక్స్‌జి 218582 నంబర్) లాటరీ టికెట్ కొన్నాడు. అక్కడ నుంచి బయటికి వెళ్లి మాంసం కొనుగోలు చేశాడు. డ్రా తీశాక ఫలితాలను చెక్ చేసుకుంటే తన టికెట్‌కు రూ.12 కోట్లు తగిలాయి. పిల్లలకు మంచి జీవితం అందించడానికి ఈ డబ్బును ఖర్చు చేస్తానని సదానందన్ చెప్పారు. భార్య రాజమ్మ, ఇద్దరు కుమారులతో సదానందన్ కుడయంపాడిలో ఒక చిన్న ఇంట్లో నివసిస్తున్నాడు.