ఇస్లామాబాద్: దేశంలోని అన్ని విద్యా సంస్థలలో హోలీ ఉత్సవాల నిర్వహణపై నిషేధం విధించినట్లు పాకిస్తాన్‌కు చెందిన ఉన్నత విద్యా కమిషన్ బుధవారం ప్రకటించింది.
ఇటువంటి కార్యకలాపాలు దేశ సామాజిక సాంస్కృతిక స్వరూపానికి దూరంగా ఉండడమే కాకుండా పాకిస్తాన్‌కు చెందిన ఇస్లామిక ఉనికి పతనానికి దారితీయగలదని ఒక ప్రకటనలో ఉన్నత విద్యా కమిషన్ తెలిపింది.
ఇస్లామాబాద్‌లోని ఖ్వాయిద్ అజామ్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు జూన్ 12న తమ యూనివర్సిటీ క్యాంపస్‌లో మొట్టమొదటిసారి అత్యంత ఘనంగా హోలీ వేడుకను జరుపుకున్నారు. దీనిపై సామాజిక మాధ్యమాలలో భిన్న స్పందన వ్యక్తమైంది. హోలీ వేడుకలు జరుపుకున్న విద్యార్థులను భారత్‌కు పంపివేయాలంటూ కూడా కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ఉన్నత విద్యా సంస్థలలతోసహా అన్ని విద్యా సంస్థలలో హోలీ వేడుకల నిర్వహణను నిషేధిస్తూ పాక్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.