Monday, January 20, 2025

భారత గగనతలంలో 10 నిమిషాలు పాక్ బోయింగ్ చక్కర్లు

- Advertisement -
- Advertisement -

కరాచి: భారీ వర్షం కారణంగా పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పిఐఎ)కు చెందిన విమానం భారత గగనతలంలో 10 నిమిషాలు సంచరించి పంజాబ్‌పైన 125 కిలోమీటర్లు ప్రయాణించినట్లు పాకిస్తాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. మే 4వ తేదీన ఈ ఘటన జరిగింది. పిఐఎకి చెందిన పికె 248బోయింగ్ 777 విమానం రాత్రి 8.05గంటలకు కరాచీలోని అల్లమాఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో భారీ వర్షం పడుతుండడంతో బోయింగ్ 777 విమానాన్ని ల్యాండింగ్ చేయడం పైలట్‌కు సాధ్యంకాలేదు.

Also Read:  సన్‌రైజర్స్ ఉత్కంఠ గెలుపు..

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ ఆదేశాల మేరకు పైలట్ విమానాన్ని ఆకాశమార్గం పట్టించాడు. భారీ వర్షం పడుతుండడం, తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న కారణంగా పైలట్ దారి తప్పి భారత్‌లోని పంజాబ్‌లోకి ప్రవేశించాడు. బధానా ఓలీసు స్టేషన్ పరిధిలోని భారతీయ గగనతలంలోకి విమానం పాకిస్తాన్ కాలమానం రాత్రి 8.11 గంటకు ప్రవేశించింది. 13,500 అడుగుల ఎత్తులో గంటకు 292 కిలోమీటర్ల వేగంతో విమానం అమృత్‌సరకు 37 కిలోమీటర్ల దూరంలోని ఛీనా బిద్ధీ చాంద్ గ్రామంపైన ప్రయాణించింది. 40 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన విమానం పంజాబ్‌లోని తరన్ సాహిబ్, రసూల్‌పూర్ పట్టణాల మీదుగా ఎగిరింది. ఆ సమయంలో విమానం 20,000 అడుగుల ఎత్తులో ఉంది. ఏడు నిమిషాల పాటు భారత గగనతంలో ప్రయాణించిన బోయింగ్ 777 పంజాబ్‌లోని జాగిన్ నూర్ ముహమ్మద్ గ్రామ సమీపంలో పాకిస్తాన్ గగనతలంలోకి తిరిగి ప్రవేశించింది.

మళ్లీ భారత భూభాగంలోని దోనా మబోకి, చాంత్, డుప్సారి కసూర్ మీదుగా పాకిస్తాన్‌కు చెందిన పంజాబ్‌లోని కసూర్ జిల్లాలోని ఘటి కలంజర్‌లోకి ప్రవేశించింది. మూడు నిమిషాల తర్వాత రాత్రి 8.22 గంటలకు భారత్‌లోని పంజాబ్‌కు చెందిన లఖా సింగ్‌వాలా హహితర్ మీదుగా పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించింది. విమానం 23,000 అడుగుల ఎత్తులో, గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ఆ సమయంలో ప్రయాణిస్తోంది. అనంతరం విమానం కరాచీ అంతర్జాతీయ విమానాశ్రయంలో సురక్షితంగా దిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News