Wednesday, January 22, 2025

ధోనీ రికార్డు బ్రేక్ చేసిన బాబర్..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ పొట్టి క్రికెట్‌లో అరుదైన ఘనతను సాధించాడు. టి20ల్లో కెప్టెన్‌గా అత్యధికంగా విజయాలు సాధించాడు. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, అఫ్గాన్ మాజీ కెప్టెన్ అస్గర్ సరసన నిలిచాడు. ఈక్రమంలో టిమిండియా కెప్టెన్ ధోనీ పేరిట ఉన్న రికార్డును బాబర్ బ్రేక్ చేశాడు. ధోని 2007 నుంచి 2016  వరకు మొత్తం  72 టీ 20 మ్యాచ్ లకు టీమిండియాకు కెప్టెన్ గా వ్యవహరించగా ఇందులో 41 విజయాలను అందించాడు.

Also Read:గుజరాత్ పై బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్..

అయితే ధోని కంటే 5 మ్యాచ్ లు తక్కువగానే ఆడిన బాబర్ అజామ్ ఆ  రికార్డును సమం చేశాడు.   కాగా కెరీర్లో ఇప్పటి వరకూ 101 టి20లు ఆడి 3,465పరుగులు చేసిన బాబర్ కెప్టెన్‌గా 42విజయాలు సాధించాడు. అదే విధంగా టి20ల్లో అత్యధికంగా మూడు సెంచరీలు చేసిన ఏకైక కెప్టెన్‌గా బాబర్ నిలిచాడు. కాగా పాక్, కివీస్ టి20 సిరీస్‌లోని మూడో టి20 సోమవారం వేదికగా జరగనుంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News