- Advertisement -
న్యూఢిల్లీ: పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడికి.. కేంద్రం ప్రతిదాడిని ప్రారంభించింది. భారత్‌లో ఉంటున్న పాక్ పౌరులకు తక్షణమే వీసా సేవలు నిలిపివేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నెల 27 నుంచి పాక్ పౌరులకు భారత్ జారీ చేసిన వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పహల్‌గామ్ ఉగ్రవాద దాడి దృష్ట్యా బుధవారం జరిగిన సిసిఎస్ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ చర్యలు చేపట్టింది. పాక్ పౌరులకు జారీ చేసిన వైద్య వీసాలు ఈ నెల 29 వరకే చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. భారత్‌లో ఉన్న పాక్ పౌరులు, వీసాల గడువు ముగిసేలోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. పాక్ పర్యటనకు దూరంగా ఉండాలని భారత పౌరులకు కేంద్రం సూచించింది. పాక్‌లో ఉన్న భారత పౌరులు కూడా త్వరగా స్వదేశానికి తిరిగి రావాలని పేర్కొంది.
- Advertisement -