- Advertisement -
పాక్ కమాండర్లకు ఐఎస్‌ఐ ఆదేశం
ఇస్లా మాబాద్: రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ పాకిస్తాన్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ తన కమాండర్లకు ఆదేశాలు జారీచేసింది. రానున్న పంజాబ్ ఎన్నికలలో అవకతవకలకు పాల్పడేందుకు ఐఎస్‌ఐకు చెందిన కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారంటూ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పార్టీ నాయకులు ఇటీవల ఆరోపణలు చేసిన దరిమిలా దేశ సైన్యాధ్యక్షుడు జనరల్ ఖమర్ జావేద్ బజ్వా ఇచ్చిన ఆదేశాల మేరకు ఐఎస్‌ఐ తన కమాండర్లకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. రాజకీయాలు దూరంగా ఉండాలని, ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోరాదని ఐఎస్‌ఐ తన కమాండెంట్లకు కచ్ఛితమైన ఆదేశాలు ఇచ్చినట్లు ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ దినపత్రిక మంగళవారం పేర్కొంది. ఏ అధికారి అయినా ఈ ఆదేశాలను ఉల్లంఘించిన పక్షంలో కఠిన చర్యలు ఎదుర్కోవలసి వస్తుందని కూడా ఐఎస్‌ఐ హెచ్చరించింది.
- Advertisement -