Monday, December 23, 2024

ఉగ్రవాదులపై ఆర్మీ ఎన్‌కౌంటర్ వేళ.. పాక్ పోస్ట్ నుంచి కాల్పులు

- Advertisement -
- Advertisement -

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్ లోని బారాముల్లా జిల్లాలో గల ఉరి సెక్టార్‌లో శనివారం భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. భారత భూభాగం లోకి ప్రవేశించేందుకు ఉగ్రవాదులు నియంత్రణ రేఖ వెంబడి మాటు వేశారు. దీని గురించి సమాచారం అందుకున్న భారత సైన్యం , జమ్ముకశ్మీర్ పోలీస్‌లు, నిఘా వర్గాలు సంయుక్త ఆపరేషన్ చేపట్టాయి. శనివారం తెల్లవారు జామున నియంత్రణ రేఖను దాటేందుకు ప్రయత్నించిన ముష్కరులపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గుర ఉగ్రవాదులు హతమైనట్టు ఆర్మీచినార్ కార్ప్ వెల్లడించింది. ఇద్దరు ఉగ్రవాదుల మృతదేహాలను సైన్యం స్వాధీనం చేసుకుంది.

అయితే మూడో ముష్కరుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుంటుండగా, సమీపం లోని పాకిస్థాన్ పోస్ట్ నుంచి తమపై కాల్పులు జరిగినట్టు చినార్ కార్ప్ తెలియజేసింది. ప్రస్తుతం ఉరి సెక్టార్‌లో ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది. అనంతనాగ్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం కొనసాగిస్తున్న వేట నాలుగో రోజుకు చేరింది. గఢాల్ అడవుల్లోని పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతాన్ని కచ్చితంగా కనిపెట్టేందుకు సైన్యం డ్రోన్లను రంగం లోకి దించింది. డ్రోన్లతో చేసిన సర్వే ఆధారంగా తీవ్రవాదులు దాక్కొన్న ప్రాంతంపై సైన్యం మోర్టార్ షెల్స్‌తో దాడి చేస్తోంది. ఈ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్ లోనే కర్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్, థోనక్, డీఎస్పీ హుమాయూన్ భట్ , రాష్ట్రీయ రైఫిల్ సైనికుడు రవికుమార్ మృతి చెందిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News