రెండు నిమిషాల్లోగా బ్యాటర్ పిచ్ పైకి రాకపోతే ఏం జరుగుతుందో శ్రీలంక బ్యాటర్ మాథ్యూస్ ని అడిగితే చెబుతాడు. బంగ్లాదేశ్ తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ లో మాథ్యూస్ సకాలంలో రాకపోవడంతో అంపైర్ అతన్ని టైమ్డ్ ఔట్ గా ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్తగా వెలుగులోకి వచ్చిన ఈ టైమ్డ్ ఔట్.. ఇప్పుడు బ్యాటర్లని భలే కంగారు పెడుతోంది.
బిగ్ బాష్ లీగ్ లో భాగంగా సిడ్నీ థండర్స్, మెల్ బోర్న్ స్టార్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఒక వింత సంఘటన చోటు చేసుకుంది. పాకిస్తాన్ బ్యాటర్ హారిస్ రవూఫ్ ప్యాడ్లు, గ్లోవ్స్, హెల్మెట్ ఏవీ ధరించకుండానే పిచ్ పైకి పరుగులు ఉరుకులతో వచ్చేశాడు. టైమ్డ్ ఔట్ కాకుండా ఉండేందుకే ఇలా వచ్చాడని వేరే చెప్పాలా?
నిజానికి మొదట బ్యాటింగ్ చేసిన మెల్ బోర్న్ స్టార్స్ ఇన్నింగ్స్ చివరిలో వరసగా వికెట్లు పడ్డాయి. ఆ జట్టు తరఫున ఆడుతున్న రవూఫ్ బ్యాటింగ్ చేసే అవకాశం తనకు రాదనే ధీమాతో డగౌట్ లో కూర్చున్నాడు. అయితే వికెట్లు టపటపా పడిపోవడంతో రవూఫ్ బరిలోకి దిగాల్సివచ్చింది. అప్పటివరకూ ప్యాడ్లు కట్టుకోకపోవడంతో అలాగే గబగబా మైదానంలోకి వచ్చేశాడు. అతన్ని చూసి సిడ్నీ థండర్స్ జట్టు ఆటగాళ్లకు నవ్వాగలేదు. తీరా రవూఫ్ వచ్చాడే గానీ అతనికి బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కేవలం ఒక్క బంతి మాత్రమే మిగిలి ఉండగా అతను పిచ్ పైకి వచ్చాడు. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లోనే ఉండి, వెనుదిరిగాడు.
No gloves, pads or helmet on 🤣
Haris Rauf was caught by surprise at the end of the Stars innings!@KFCAustralia #BucketMoment #BBL13 pic.twitter.com/ZR9DeP8YhW
— KFC Big Bash League (@BBL) December 23, 2023