అయోధ్యలో సోమవారంనాడు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కన్నుల పండువగా జరిగింది. కనీసం 50 దేశాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేశారు. వేలాది మంది భక్తులు బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని చూసి పులకించిపోయారు. వీరిలో పాకిస్తాన్ కు చెందిన క్రికెటర్ కూడా ఉండటం విశేషం. అతని పేరు డేనిష్ కనేరియా. ఒకప్పుడు పాకిస్తాన్ జట్టు తరపున ఆడిన కనేరియా హిందు మతస్థుడు. ఇప్పటివరకూ పాక్ జట్టు తరఫున రెండో హిందూ మతస్థుడు కనేరియానే. అంతకుముందు అనిల్ దళపత్ సొనావారియా పాకిస్తాన్ తరఫున కొన్ని టెస్టులు ఆడాడు. అనిల్, డేనిష్ కనేరియా కజిన్స్ కావడం విశేషం.
ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కనేరియా ఓ వీడియోను పోస్టు చేస్తూ, ‘రాముడు వచ్చేశాడు, అందరికీ అభినందనలు’ అంటూ కామెంట్ పెట్టాడు. పాకిస్తాన్ తరపున డేనిష్ 2000-2010 మధ్య కాలంలో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడాడు. 276 వికెట్లు కూడా తీశాడు.
Jai Shree Ram
pic.twitter.com/vcowGg8fYj
— Danish Kaneria (@DanishKaneria61) January 22, 2024