Monday, December 23, 2024

మార్చి 19న ఢిల్లీ హైకోర్టుకు రావాలి.. పాక్ హిందూ శరణార్థులకు పిలుపు

- Advertisement -
- Advertisement -

పౌరసత్వ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం మార్చి 19 తేదీన లేదా ఆ తర్వాత ఢిల్లీ హైకోర్టుకు రావాలని మజ్నూ కా టిలాకు చెందిన పాకిస్తానీ హిందూ శరణార్థులను కోరినట్లు పాకిస్తానీ హిందూ శరణార్థి దరమ్‌వీర్ సోలంకి గురువారం తెలిపారు. వచ్చే వారం తాము హైకోర్టును సందర్శించిన తర్వాత భారతీయ పౌరులుగా తమను రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియ గురించి తెలియచేస్తారని ఆయన చెప్పారు. బుధవారం రాత్రి తమకు ఈ విషయాన్ని ఒక న్యాయవాది తెలిపినట్లు ఆయన చెప్పారు.

కోర్టును సందర్శించిన తర్వాత తమంతట తామే రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియ గురించి తెలియచేస్తారని ఆయన తెలిపారు. 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి భారత్‌కు వచ్చిన ముస్లిమేతర వలసదారులకు భారతీయ పౌరసత్వాన్ని కల్పించేందుకు మార్గాన్ని సుగమం చేస్తూ సిఎఎపై కేంద్రం గత సోమవారం నోటిఫికేషన్ జారీచేసింది. తమను వేరే చోటుకు తరలించబోమని మజ్నూ కా టిలాలో నివసిస్తున్న శరణార్థులకు అధికారులు చెప్పారని సోలంకి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News