పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ నుంచి ఎల్లుండి అధికారిక ప్రకటన..?
ఇస్లామాబాద్: భారత్‌తో శాంతియుత సంబంధాలను నెలకొలుపుకోవాలని పాకిస్థాన్ తన నూతన రక్షణ విధానపత్రంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. పొరుగు దేశాలతో శాంతియుత సంబంధాలను కొనసాగించాలన్న విధానంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు దినపత్రిక ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ విశ్లేషించింది. పాకిస్థాన్ వైఖరిలో గతంలో ఎన్నడూ లేనంత మార్పు ఈ విధానపత్రంలో ఉన్నదని తెలిపింది. భారత్‌తో సుహృద్భావ సంబంధాలకు ఆటంకంగా తయారైన కాశ్మీర్ అంశాన్ని సుదీర్ఘ సమస్యగా ఆ విధానపత్రంలో విశ్లేషించినట్టు తెలుస్తోంది.
నూతన రక్షణ విధానానికి ఆ దేశ భద్రతా కమిటీతోపాటు కేబినెట్ గత నెలలోనే ఆమోదం తెలిపాయి. తమ దేశ నూతన విదేశాంగ విధానాన్ని పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శుక్రవారం అధికారికంగా ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. 100 పేజీల ఈ నూతన విదేశాంగ విధాన పత్రంలో పొరుగు దేశాలతో శాంతితోపాటు ఆర్థిక దౌత్యాన్ని కొనసాగించాలని ప్రతిపాదించారు. 202226 కాలానికి ఈ నూతన విధానాన్ని రూపొందించారు. అణ్వాయుధాలు కలిగిన ఇరు దేశాల మధ్య చర్చలకు కాశ్మీర్ అంశం అడ్డంకి కాకూడదని విధానపత్రంలో విశ్లేషించినట్టు తెలుస్తోంది. భారత్‌తో మరో 100 ఏళ్ల వరకూ శత్రుత్వాన్ని తాము కోరుకోవడంలేదని పేరు వెల్లడించడానికి ఇష్టపడని పాక్ అధికారి ఒకరు తెలిపారు.