Saturday, April 26, 2025

పీక కోస్తానంటూ.. పాక్ అధికారి అహంకారం

- Advertisement -
- Advertisement -

లండన్: పహల్‌గామ్ ఉగ్రవాద దాడి జరిగినప్పటి నుంచి భారత్, పాకిస్థాన్‌ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాకిస్థాన్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు భారత్ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాకిస్థాన్‌ కూడా భారత్‌పై తమ అక్కసును వెళ్లగక్కుతోంది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా పహల్‌గామ్ ఘటనపై ఎలాంటి విచారణకు అయినా సిద్ధంగా ఉన్నామంటూ.. వ్యాఖ్యానించారు.

అయితే కొందరు పాకిస్థానీలు మాత్రం భారత్‌పై రెచ్చిపోయి.. కామెంట్లు చేస్తున్నారు. అలాంటి కోవకు చెందిన వ్యక్తే ఈ అధికారి. లండన్‌లో భారతయులు పాకిస్థాన్ హైకమీషన్ వద్ద పహల్‌గామ్ ఉగ్రవాద దాడికి నిరసన తెలిపారు. ఈ క్రమంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే యూకెలో పాకిస్థాన్ హైకమిషన్‌కు చెందిన కల్నల్ తైమూర్ రహత్.. నిరసన తెలుపుతున్న ప్రదేశానికి వచ్చాడు. అందరూ చూస్తుండగానే.. భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్థమాన్ ఫ్లెక్సీని చూపిస్తూ.. ‘పీక కోస్తా’ అంటూ సైగలు చేశాడు. దీంతో అక్కడ భారతీయులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దృశ్యాలను అక్కడ ఉన్న ఓ వ్యక్తి రికార్డు చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News