Thursday, April 24, 2025

ఉగ్రదాడిని కేక్‌ కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్న పాక్ అధికారులు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: ఏప్రిల్ 22వ తేదీన పహల్‌గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి ప్రతీ భారతీయుడి మనస్సును కలచివేసింది. ఈ దాడిని ఖండిస్తూ.. దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దాడికి దేశమంత కన్నీటిపర్యంతమవుతుంటే.. ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమీషన్ అధికారులు సంబురాలు చేసుకున్నట్లు తెలుస్తోంది. అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి. తాజాగా ఆ కార్యాలయంలోకి ఓ వ్యక్తి కేకు తీసుకువెళ్లాడు. మీడియా ప్రతినిధులు ఆ కేకు ఎందుకు అని ప్రశ్నించగా.. అతను సమాధానం చెప్పకుండా తప్పించుకొని లోపలికి వెళ్లాడు. దీంతో పాక్ అధికారులు ఉగ్రదాడిని సెలబ్రేట్ చేసుకున్నట్లే తెలుస్తోంది. దీనిపై తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్థాన్ హై కమీషన్ ఎదుట పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News