Saturday, January 18, 2025

ఇమ్రా న్ ఖాన్‌కు 14 ఏళ్ల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కు మరొక ఎదురుదెబ్బ తగిలింది. అల్ ఖాదిర్ కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు, ఆయన భార్య బుష్రా బీబీలను అవినీతి నిరోధక కోర్టు దోషులుగా నిర్ధారించింది. ఈ కేసులో ఇమ్రాన్‌కు 14 సంవత్సరాల జైలు శిక్షను, బుష్రాకు ఏడు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. ఇమ్రాన్‌కు పది లక్షలు, బుష్రాకు 5 లక్షల పాకిస్తానీ రూపాయల జరిమానాను కోర్టు విధించింది. అడియాలా జైలులో కట్టుదిట్టమైన భద్రత మధ్య న్యాయమూర్తి నసీర్ జావేద్ రాణా తుది తీర్పు చదివి వినిపించారు. అల్ ఖాదిర్ ట్రస్ట్ కేసు వివరాలలోకి వెళితే, లండన్‌లో ఉంటున్న పాకిస్తాన్ స్థిరాస్తి వ్యాపారి మాలిక్ రియాజ్ హుస్సేన్ నుంచి వసూలు చేసిన 19 కోట్ల పౌండ్లను బ్రిటన్ ప్రభుత్వం పాకిస్తాన్‌కు పంపగా, ఆ సొమ్మును ఇమ్రాన్ ఖాన్ దంపతులు గోల్‌మాల్ చేశారని వారిపై ఉన్న ఆరోపణ.

ఆ సొమ్మును జాతీయ ఖజానాలో జమ చేయకుండా సుప్రీం కోర్టు అంతకు ముందు రియాజ్ హుస్సేన్‌కు విధించిన జరిమానాలో కొంత మొత్తాన్ని ఆ నగదు నుంచి కట్టారనేది వారిపై ఉన్న అభియోగం.దీనికి బదులుగా ఇమ్రాన్ దంపతులు నెలకొల్పబోతున్న అల్ ఖాదిర్ విశ్వవిద్యాలయానికి 57 ఎకరాలను రియాజ్ హుస్సేన్ ఇచ్చినట్లు చెబుతున్నారు. జాతీయ ఖజానాకు 19 కోట్ల పౌండ్లు మేరకు నష్టం కలిగించారని ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీ, మరి ఆరుగురిపై ఆరోపణలతో జాతీయ జవాబుదారీ మండలి (ఎన్‌ఎబి) 2023 డిసెంబర్‌లో కేసు దాఖలు చేసింది. అయితే, ఇమ్రాన్, బుష్రాపై మాత్రమే ప్రాసిక్యూషన నడిచింది. స్థిరాస్తి వ్యాపారి సహా ఇతర నిందితులు అందరూ పాకిస్తాన్ వెలుపల ఉన్నారు. ఇమ్రాన్ ఖాన్‌పై ఇప్పటి వరకు 200 పైచిలుకు కేసులు ఉన్నాయి. ఇమ్రాన్ 2023 ఆగస్టు నుంచి జైలు జీవితం గడుపుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News