న్యూఢిల్లీ: కరోనాపై పోరులో భారత్ కు పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా సంఘీభావం తెలిపారు. కరోనా నుంచి భారత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. ప్రపంచమంతా ఏకమై మహమ్మారిపై పోరాడాలని పిలుపునిచ్చారు. భారత్ లో కోవిడ్-19 సెకండ్ వేవ్ విజృంభిస్తున్న క్రమంలో తాము భారత ప్రజల కోసం ప్రార్థిస్తున్నామని పాకిస్థాన్ సమాచార శాఖ మంత్రి ఫవద్ హుస్సేన్ ప్రకటించారు. ఇలాంటి కష్టకాలంలో భారత ప్రజల కోసం మేము ప్రార్థిస్తున్నాం. దేవుడు దయ చూపాలి. త్వరలోనే ఈ కష్టాలు తొలగిపోవాలని శనివారం ట్వీట్ చేశారు.
I want to express our solidarity with the people of India as they battle a dangerous wave of COVID-19. Our prayers for a speedy recovery go to all those suffering from the pandemic in our neighbourhood & the world. We must fight this global challenge confronting humanity together
— Imran Khan (@ImranKhanPTI) April 24, 2021