Monday, December 23, 2024

భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రశంసించిన పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

- Advertisement -
- Advertisement -

Imran Khan
ఇస్లామాబాద్: ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వాన్ని విమర్శించే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత విదేశాంగ విధానాన్ని మాత్రం మెచ్చుకున్నారు. అమెరికా ఆంక్షలు విధించినప్పటికీ రష్యా నుంచి క్రూడాయిల్‌ను ఇండియా దిగుమతి చేసుకోడాన్ని ఆదివారం ఆయన కొనియాడారు. ఆయన ఖైబర్‌పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఓ పబ్లిక్ ర్యాలీలో ప్రసంగిస్తూ భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని మెచ్చుకున్నారు. ‘ఖ్వాడ్’లో భాగస్వామిగా ఉన్న భారత్ అమెరికా ఆంక్షలున్నప్పటికీ రష్యా నుంచి చమురును దిగుమతిచేసుకుంటోందన్నారు. తన విదేశాంగ విధానం కూడా ప్రజలకు అనుకూలంగా ఉండనుందన్నారు. ‘నేనెవరి ముందు తలొగ్గలేదు. నా దేశాన్ని కూడా తలొంచేలా చేయను’ అని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. పార్లమెంటులో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్న సమయంలో ఆయన తనకు మద్దతును కూడగట్టుకోవడంలో భాగంగా ర్యాలీ నిర్వహిస్తున్నారు.
‘రష్యాఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ మద్దతును యూరొప్ యూనియన్ దూతలు కోరారు. వారు ఈ వినతి ద్వారా ప్రొటోకాల్‌ను ఉల్లంఘించారు. అయితే నేను అలా చేయబోనని వారికి చెప్పాను’అన్నారు. యూరొప్ యూనియన్ కోరికను మన్నించడం ద్వారా పాకిస్థాన్ పొందేదంటూ ఏమీ ఉండదు అని కూడా ఆయన తెలిపారు. ‘ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికా జరిపిన యుద్ధంలో మనము పాల్గొన్నాము. 80వేల మందిని కోల్పోయాము. 100 బిలియన్ అమెరికా డాలర్లను కూడా నష్టపోయాము’ అని ఆయన ర్యాలీలో వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడిని ఖండించమని గత నెల పాకిస్థాన్‌ను యూరొపియన్ యూనియన్, పాశ్చాత్య దేశాలు కోరాయి…‘మీరు ఇదే డిమాండ్‌ను ఇండియాతో చేయగలరా?’ అని ఆయన ఆ సందర్భంలో అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News