ఇస్లామాబాద్: పాక్ నేషనల్ అసెంబ్లీ రద్దుపై తీర్పును పాకిస్థాన్ సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ రాత్రి 8 గంటలలోపు తీర్పు వెలువడవచ్చని తెలుస్తోంది. అంతకు ముందు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని సుప్రీం తప్పుబట్టింది. పాకిస్థాన్ ఆర్ధిక పరిస్థితి సరిగా లేదని, శ్రీలంకలా తయారౌతోందని ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని, బలహీన ప్రభుత్వం సరికాదని పాక్ సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. మరోవైపు ఇమ్రాన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఫవాద్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా వస్తే దేశం 5 దశాబ్దాలు వెనక్కు వెళ్తుందన్నారు. విపక్షాలు విదేశాలతో చేతులు కలిపి కుట్ర చేశాయని ఆరోపించారు.
Supreme Court will give its verdict on the deputy speaker’s ruling to disallow the no-confidence motion at 7:30pm today: Pakistan media
— ANI (@ANI) April 7, 2022