Sunday, January 19, 2025

World Cup: నేడు పాక్ తో తలపడనున్న ఆసీస్

- Advertisement -
- Advertisement -

ప్రపంచకప్‌లో భాగంగా శుక్రవారం జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి.బెంగళూరు వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. పాక్ మూడు మ్యాచుల్లో రెండింటిలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా మాత్రం ఒకదాంట్లో మాత్రమే గెలిచింది. ఈ మ్యాచ్‌ను ఇరు జట్లు సవాల్‌గా తీసుకున్నాయి. ఎలాగైనా గెలిచి నాకౌట్ రేసులో నిలువాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇరు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లు ఉండడంతో పోరు ఆసక్తికరంగా సాగడం ఖాయం. పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ నాలుగో స్థానంలో ఉండగా ఆస్ట్రేలియా ఆరో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోతే సెమీస్ చేరడం కష్టంగా ఉంటుంది. ఇప్పటికే ఆసీస్ రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయి పీకల్లోతు కష్టాల్లో ఉంది.

Also Read: అధికారమిస్తే కులగణన

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News