Saturday, April 5, 2025

తొలి టెస్టులో పాకిస్థాన్‌ కు బంగ్లా ధీటైన సమాధానం

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ అద్భుత ఆటతో ఆకట్టుకుంటోంది. ముష్ఫికుర్ రహీం అద్భుత శతకం సాధించడంతో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 167.3 ఓవర్లలో 565 పరుగులకు ఆలౌటైంది. కీలక ఇన్నింగ్స్ ఆడిన రహీం 22 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 191 పరుగులు చేశాడు. చివర్లో మెహదీ హసన్ మీరాజ్ ఆరు ఫోర్లతో 77 పరుగులు సాధించాడు.

ఇక ఓపెనర్ షద్మన్ ఇస్లామ్ (93), మోమినుల్ హక్ (50), లిటన్ దాస్ (50)లు కూడా అర్ధ సెంచరీలతో తమ వంతు పాత్ర పోషించారు. కాగా, పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 448 పరుగులకు ఆలౌటైంది. తర్వాత రెండో ఇన్నింగ్స్ చేపట్టిన ఆతిథ్య పాకిస్థాన్ శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 23 పరుగులు చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News