గాలే: శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 344 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్ బుధవారం చివరి రోజు ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. లంక బౌలర్లు గెలుపు కోసం తీవ్రంగా పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పాకిస్థాన్‌ఓపెనర్ అబ్దుల్లా షఫిక్ చిరస్మరణీయ శతకంతో పాకిస్థాన్‌కు విజయం సాధించి పెట్టాడు. అతనికి వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ సహకారం అందించాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడిన షఫిక్ 408 బంతుల్లో ఏడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో అజేయంగా 160 పరుగులు సాధించి పాకిస్థాన్ గెలిపించాడు. ఇక ఇమాముల్ హక్ (35), కెప్టెన్ బాబర్ ఆజమ్ (55) తమవంతు పాత్ర పోషించారు. చివరి రోజు రిజ్వాన్ కీలక ఇన్నింగ్స్‌తో జట్టు విజయంలో ముఖ్యభూమిక పోషించాడు. లంక బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న రిజ్వాన్ రెండు ఫోర్లతో కీలకమైన 40 పరుగులు చేశాడు. దీంతో పాకిస్థాన్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో లంక తొలి ఇన్నింగ్స్‌లో 222, రెండో ఇన్నింగ్స్‌లో 337 పరుగులు చేసింది. పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకు ఆలౌటైంది. సెంచరీ హీరో షఫిక్‌కు మ్యాన్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు లభించింది.
PAK vs SL 1st Test: Pakistan Won by 4 wickets