Monday, January 20, 2025

పాక్ ఘన విజయం

- Advertisement -
- Advertisement -

తొలి టెస్టులో విండీస్ పరాజయం

కరాచీ: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో పాకిస్థాన్ 127 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ నిర్దేశించిన 251 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక విండీస్ జట్టు చేతులెత్తేసింది. పాక్ స్పిన్నర్లు సాజిద్ ఖాన్ 5, అబ్రార్ అహ్మద్ 4 చెలరేగడంతో సెకెండ్ ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 123 పరుగులకే ఆలౌట్ అయింది. విండీస్‌ను గెలిపించేందుకు అలిక్ అథనాజ్ (55) ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. టెవిన్ ఇమ్లాచ్ (14), మికైల్ లూయిస్ (13), క్రెయిగ్ బ్రాత్‌వైట్ (12), కెవిన్ సింక్లెయిర్ (10) నామమాత్రపు స్కోర్లు చేసారు. జస్టిన్ గ్రీవ్స్ 9, కీసీ కార్తీ 6, కవెమ్ హాడ్జ్, మోటీ, వార్రికన్ విఫలమయ్యారు. దీంతో ఘోర ఓటమిపి మూటగట్టుకుంది. అంతకుముందు విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 137 పరుగులకే ఆలౌట్ అయింది.

నౌమన్ అలీ 5, సాజిద్ ఖాన్ 4, అబ్రార్ అహ్మద్ 1 వికెట్లు తీయడంతో విండీస్ బ్యాటర్లు రాణించలేకపోయారు. వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో వార్రికన్ (31 నాటౌట్), జేడన్ సీల్స్ (22) మాత్రమే నామమాత్రంగా ఆడారు. మిగతా అందరూ చేతులెత్తేశారు. అయితే.. వెస్టిండీస్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జోమెల్ వార్రికన్ 7 వికెట్లు పడగొట్టి రెండో ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ ను గట్టిగా దెబ్బ కొట్టాడు. దీంతో పాక్ జట్టు 157 పరుగులకే కుప్పకూలింది. పాక్ ఇన్నింగ్స్‌లో షాన్ మసూద్ (52) మినహా.. మహ్మద్ హురైరా 29, కమ్రాన్ గులామ్ 27, సల్మాన్ అఘా 14, నౌమన్ అలీ 9, సాజిద్ ఖాన్ 5, బాబర్ ఆజమ్ 5, సౌద్ షకీల్ 2, మహ్మద్ రిజ్వాన్ 2, అంతా విఫలమయ్యారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News