Thursday, January 23, 2025

బ్రిక్స్‌లో సభ్యత్వానికి ఎలాంటి అభ్యర్థన చేయలేదు: పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : ప్రస్తుతం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌతాఫ్రికా సభ్య దేశాలుగా ఉన్న బ్రిక్స్ మరో ఆరు దేశాలకు సభ్యత్వం కల్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈమేరకు అర్జెంటైనా, ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్ , సౌదీ అరేబియా ,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తదితర ఆరు దేశాలను సభ్యులుగా చేర్చుకోడానికి ఆగస్టు 24న బ్రిక్స్ సదస్సు నిర్ణయించింది. అనేక దేశాలు సభ్యత్వం పొందడానికి ప్రయత్నిస్తుండగా, అయితే పాక్‌ను సదస్సు విస్మరించింది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విస్మరణకు గురయ్యిందా అన్న ప్రశ్నకు పాక్ విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి ముంతాజ్ జహ్రా బలోచ్ బదులిస్తూ తాము బ్రిక్స్ సదస్సులో సభ్యత్వం కోసం ఇంకా ఎలాంటి అధికారిక అభ్యర్థన చేయలేదని వివరించారు. తాజాగా జరిగిన బ్రిక్స్ సదస్సు నిర్ణయాలను తాము పరిశీలిస్తున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News