Sunday, December 22, 2024

పాక్ వైమానిక శిక్షణా కేంద్రంపై ఉగ్రవాదుల దాడి(వీడియో)

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్: పంజాబ్ ప్రావిన్సులోని పాకిస్తాన్ వైమానిక దళ శిక్షణా స్థావరంపై సాయుధ ఉగ్రవాదులు శనివారం తెల్లవారుజామున దాడి చేసి మూడు విమానాలను ధ్వంసం చేసినట్లు పాకిస్తాన్ సైన్యం తెలిపింది.

పాకిస్తాన్ వైమానిక దళ మియాన్‌వాలి శిక్షణా స్థావరంపై గ్రవాదులు దాడి చేయగా పాక్ సైనికులు తిప్పికొట్టారని, ఈ దాడిలో ముగ్గురు ఉగ్రవాదులు మరణించగా మరో ముగ్గురిని సైన్యం నిర్బంధించిందని పాకిస్తాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా..ఉగ్రవాదుల దాడిలో మూడు నిలిపి ఉన్న విమానాలు ధ్వంసమయ్యాయని, ఇంధన నష్టం కూడా వాటిల్లిందని సైన్యం తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News