Sunday, January 26, 2025

పాక్ ఎయిర్ హోస్టెస్ ల మిస్సింగ్..!

- Advertisement -
- Advertisement -

పాకిస్తాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పిఐఎ)లో విధుల్లో ఉన్న ఎయిర్ హోస్టెస్ లు ఒక్కొక్కరుగా మాయమవుతున్నారు. తాజాగా మరో ఎయిర్ హోస్టెస్ కనిపించకుండా పోయిందని పాకిస్థాన్ లోని ఓ ప్రముఖ వార్తాపత్రిక తెలిపింది. విధుల్లో భాగంగా సోమవారం ఇస్లామాబాద్ నుంచి పీఐఏ ఫ్లైట్ పీకే-782లో కెనడాలోని టొరంటో వెళ్లిన ఎయిర్ హోస్టెస్ మరియం రజా అదృశ్యమైనట్లు వెల్లడించింది.

టొరంటో నుంచి కరాచికి వెళ్లాల్సి ఉండగా ఆమె విధులకు హాజరు కాకపోవడంతో..ఆమె హోటల్ గదిని అధికారులు పరిశీలించగా… కృతజ్ఞతలు పీఐఏ అంటూ ఓ లేఖతోపాటు ఆమె యూనిఫాంను గుర్తించారు. ఆమె ఏమైందనే విషయాన్ని అధికారులు కనుక్కోలేకపోయారు. అయితే, ఇలాంటి ఘటనలు పాకిస్తాన్ లో తరుచుగా చోటుచేసుకుంటున్నారు. ఇప్పటికే 9మంది పాక్ ఎయిర్ హెోస్టెస్ లు మాయమయ్యారు. గతేడాది ఏడుగురు.. ఈ ఏడాది ఇద్దరు ఎయిర్ హెోస్టెస్ లు మిస్ అయ్యారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News