Tuesday, November 5, 2024

ఉక్రెయిన్‌కు పాక్ విలువైన ఆయుధాలు..

- Advertisement -
- Advertisement -

బీబీసీ నివేదిక వెల్లడి …ఖండించిన పాక్

ఇస్లామాబాద్ :తీవ్ర ద్రవ్యోల్బణంతో ఆర్థికంగా అధ్వాన్న స్థితిలో ఉన్న పాకిస్థాన్ 364 మిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను ఉక్రెయిన్‌కు విక్రయించినట్టు నివేదికలు వెలువడడం చర్చనీయాంశం అవుతోంది. మందుగుండు సామాగ్రిని సరఫరా చేయడానికి గత ఏడాది రెండు ప్రైవేట్ అమెరికా కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుందని , ఆయుధాలను సరఫరా చేసిందని మీడియా నివేదిక పేర్కొంది.

అమెరికన్ ఫెడరల్ ప్రొక్యూర్‌మెంట్ డేటా సిస్టమ్ వివరాల ప్రకారం , 155 ఎంఎం షెల్స్ విక్రయించడానికి పాకిస్థాన్ సైన్యం గ్లోబల్ మిలిటరీ, నార్త్రోప్ గ్రుమ్మన్ అనే రెండు అమెరికన్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు బీబీసీ నివేదిక పేర్కొంది. ఈమేరకు 2022 ఆగస్టు 17న సంతకాలు జరిగినట్టు తెలియజేసింది. అయితే ఈ వార్తలను ఇస్లామాబాద్ లోని పాక్ విదేశాంగ కార్యాలయం ఖండించింది.

ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో పాకిస్థాన్ తటస్థ విధానాన్ని కొనసాగిస్తోందని, తాము ఎవరికీ ఆయుధాలు విక్రయించలేదని వెల్లడించింది. గత ఏడాది ఏప్రిల్ లో అవిశ్వాసం ద్వారా ప్రధాని పదవి నుంచి ఇమ్రాన్‌ఖాన్‌ను తొలగించిన తరువాత ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రభుత్వ హయాంలో ఈ ఒప్పందాలు జరిగాయన్న ఆరోపణలు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News