Wednesday, January 22, 2025

పాకిస్థాన్ ఆర్మీబేస్‌పై ఆత్మాహుతి దాడి…23 మంది మృతి

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. ఆర్మీయే లక్షంగా ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 23 మంది ప్రాణాలు కోల్పోయారు. ఖైబర్ ఫంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలోని ఓ పాఠశాల భవనాన్ని పాక్ సైన్యం తాత్కాలిక సైనిక స్థావరంగా ఏర్పాటు చేసుకుంది. ఈ ఆర్మీ బేస్‌పై మంగళవారం తెల్లవారు జామున పేలుడు పదార్థాలు నిండిన కారుతో ఉగ్రవాదులు పాఠశాలభవనాన్ని ఢీకొట్టారు. ఆత్మాహుతి బాంబర్లు సెక్యూరిటీ కాంపౌండ్ లోకి చొరబడి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. భవనం లోని మూడు గదులు కూలిపోయాయి. దాడి జరిగిన సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారని అధికారులు తెలిపారు. అఫ్గానిస్థాన్ సరిహద్దు లోని గిరిజన ప్రాంతాలకు సమీపంలో జరిగిన ఈ దాడికి తామే బాధ్యులమని పాకిస్థాన్‌కు చెందిన తెహ్రీక్ ఏ జిహాద్ పాకిస్థాన్ (టిజెపి) అనే ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News