Friday, April 4, 2025

రెచ్చిపోయిన పాక్ ఆర్మీ.. బుద్ధి చెప్పిన భారత్

- Advertisement -
- Advertisement -

ఫూంచ్: జమ్ము కశ్మీర్‌లోని ఫూంచ్ జిల్లాలో మరోసారి భారత్, పాకిస్థాన్ ఆర్మీల మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్‌ఓసి) వద్ద ఏప్రిల్ 1వ తేదీన (మంగళవారం) పాక్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు భారత సైన్యం వెల్లడించింది.. ఎల్‌ఓసి దాటి చొరబాటుకు ప్రయత్నించిందని తెలిపింది. దీంతో అక్కడ ఉన్న మందుపాతర పేలిందని. ఆ తర్వాత కాల్పులకు తెగబడిందని పేర్కొంది. దీన్ని భారత ఆర్మీ సమర్థవంతంగా తిప్పికొట్టిందని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్లు స్పష్టం చేసింది. ఈ ఘటనలో నాలుగు నుంచి ఐదుగురు చొరబాటు దారులు హతమైనట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News