- Advertisement -
ఇమ్రాన్‌తో విభేదించిన పాక్ ఆర్మీ
ఇస్లామాబాద్ : తన ప్రభుత్వాన్ని అమెరికా కూల్చడానికి ప్రయత్నిస్తోందంటూ పాక్ ప్రధాని ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను పాక్ ఆర్మీ ఖండించింది. పాక్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా హస్తం ఏమాత్రం లేదని ఆర్మీ తేల్చి చెప్పింది. అమెరికాతో సత్సంబంధాలు నెరపాలన్నదే తమ అభిమతమని పేర్కొంది. దేశంలో వచ్చిన అవిశ్వాస తీర్మాన ప్రక్రియలో కూడా ఎలాంటి దౌత్యపరమైన కారణాలు లేవని ఆర్మీ స్పష్టం చేసింది. పాక్ ప్రభుత్వానికి అమెరికా ఎలాంటి లేఖలూ పంపలేదని కూడా ప్రకటించింది.
- Advertisement -