- Advertisement -
కరాచి: తమ ప్రాదేశిక జలాల్లోకి ప్రవేశించారన్న ఆరోపణలతో 17మంది భారత మత్స్యకారులను పాకిస్థాన్ సముద్రతీర భద్రతా ఏజెన్సీ అరెస్ట్ చేసింది. వారు ప్రయాణిస్తున్న మూడు పడవలను స్వాధీనం చేసుకున్నది. శుక్రవారం అరెస్టయిన మత్స్యకారులను శనివారం కోర్టులో హాజరు పరిచారు. పాక్-భారత్ జల సరిహద్దు సర్‌క్రీక్ వద్ద వీరిని అరెస్ట్ చేశారు. మత్స్యకారులను కరాచీలోని మలీర్ లేదా లాంధీ జైలుకు తరలించనున్నారు. ఏడాది క్రితం ఇదే తరహాలో 23మంది భారత మత్స్యకారులను పాక్ అరెస్ట్ చేసింది. దాని తర్వాత ఇదే మొదటి సంఘటన. అరేబియా సముద్రంలో జల సరిహద్దులను గుర్తించే సాంకేతిక పరికరాలు మత్స్యకారుల వద్ద లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. పాక్ దళాలకు చిక్కిన మత్స్యకారుల ఆ దేశపు జైళ్ల నుంచి విడుదల కావడానికి ఒక్కోసారి ఏళ్ల సమయం పడుతోంది.
- Advertisement -