ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌బంగ్లాదేశ్ జట్ల మధ్య గురువారం జరగాల్సిన గ్రూప్‌ఎ మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యింది. ఈ టోర్నమెంట్‌లో వర్షం వల్ల మ్యాచ్ పూర్తిగా రద్దు కావడం ఇది రెండోసారి. ఇంతకుముందు రావల్పిండిలోనే సౌతాఫ్రికాఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ కూడా వర్షార్పణం అయ్యింది. తాజాగా పాక్‌బంగ్లా మ్యాచ్ కూడా వరుణుడి బారిన పడి అర్ధాంతరంగా రద్దయ్యింది. ఈ మ్యాచ్‌లో కూడా టాస్ వేసే పరిస్థితి లేకుండా పోయింది. ఉదయం నుంచే రావల్పిండిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో మైదానం మొత్తం చిత్తడిగా మారింది. మధ్యలో కొంత సేపు వర్షం తగ్గుముఖం పట్టినట్టు కనిపించింది.
కానీ కొద్ది సేపటికే మళ్లీ జోరందుకుంది. చివరికి చేసేదేమీ లేకుండా అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. మ్యాచ్ రద్దు కావడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది. కాగా, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌లు ఇంతకుముందే సెమీ ఫైనల్ రేసు నుంచి నిష్క్రమించాయి. రెండు జట్లు భారత్, న్యూజిలాండ్‌లతో జరిగిన మ్యాచుల్లో ఓ టమి చవిచూశాయి. దీంతో టోర్నీ నుంచి వైదొలగక తప్పలేదు. కాగా, ఈ మ్యాచ్‌లో గెలిచి కాస్తయినా పరువును కాపాడుకోవాలని భావించిన ఆతిథ్యపాకిస్థాన్‌కు నిరాశే మిగిలింది.