Sunday, December 22, 2024

పాకిస్థాన్‌లో కొత్త ఏడాది వేడుకలపై నిషేధం

- Advertisement -
- Advertisement -

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ఈసారి నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోదు ఈ మేరకు దేశ ఆపద్ధర్మ ప్రధాని అన్వరుల్ హక్ కకర్ నిర్ణయం ప్రకటించారు. 2024 ఆగమన వేడుకలన్నింటిని నిషేధిస్తున్నట్లు కకర్ తెలిపారు. ఈ మేరకు ఆదేశాలు వెలువరించినట్లు వివరించారు. గాజా, వెస్ట్‌బ్యాంక్‌లలో పాలస్తీనియన్ల పట్ల సాగుతోన్న నరమేధం దేశాన్ని, ముస్లిం సోదరులను కలిచివేసింది. అక్కడ సాధారణ పౌరులు, అమాయక బాలలపై హత్యాకాండ దశలో తామిక్కడ ఆనందోత్సాహాలకు దిగలేమని , అందుకే కొత్త ఏడాది వేడుకలపై నిషేధం విధిస్తున్నామని ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News