Monday, December 23, 2024

క్రికెట్‌కు అసద్ షఫిక్ గుడ్‌బై

- Advertisement -
- Advertisement -

కరాచీ: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అసద్ షఫిక్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37 ఏళ్ల షఫిక్ మూడు ఫార్మాట్ల క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలని భావించినా ఫిట్‌నెస్ సహకరించడం లేదన్నాడు. కొంత కాలంగా పాకిస్థాన్ జట్టులో కూడా చోటు లభించడం లేదని, ఇలాంటి స్థితిలో ఆట నుంచి తప్పుకోవడమే మంచిదని నిర్ణయించనట్టు వెల్లడించారు. తాను చివరిసారిగా 2020లో పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించానన్నాడు. ఆ తర్వాత తనకు మరో ఛాన్స్ దక్కలేదన్నాడు.

దీంతో ఆటను తప్పుకోవాలని నిర్ణయానికి వచ్చానన్నాడు. మూడు ఫార్మాట్‌లకు కూడా వీడ్కోలు పలికాలని తెలిపాడు. సుదీర్ఘ కెరీర్‌లో తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించానని పేర్కొన్నాడు. పాకిస్థాన్ జట్టుకు ప్రాతినిథ్యం వహించడాన్ని గర్వంగా భావిస్తున్నట్టు షఫిక్ వెల్లడించాడు. కాగా, 2010లో అంతర్జాతీయ క్రికెట్‌కు శ్రీకారం చుట్టిన షఫిక్ 77 టెస్టులు, 60 వన్డేలు, మరో పది టి20 మ్యాచ్‌లలో పాకిస్థాన్‌కు ప్రాతినిథ్యం వహించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News