Wednesday, January 1, 2025

భారత్ చంద్రుడ్ని చేరుకుంటే.. పాక్ ప్రపంచాన్ని అడుక్కుంటోంది: నవాజ్ షరీఫ్

- Advertisement -
- Advertisement -

లాహోర్ : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌పై ఆ దేశ మాజీ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు భారత్ జీ 20 సమావేశాలు జరపడం, చంద్రుడిని చేరితే… పాకిస్థాన్ మాత్రం ప్రపంచం ముందు అడుక్కుంటోందని అన్నారు. దేశం ఇలా ఆర్థిక గందరగోళాన్ని ఎదుర్కోడానికి ఆ దేశ మాజీ జనరళ్లు, కొందరు న్యాయమూర్తులే కారణమని విరుచుకుపడ్డారు.

ఇటీవల జరిగిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ పార్టీ సమావేశంలో మాట్లాడిన ఆయన , పాక్ దీన స్థితిని ప్రస్తావించారు. లండన్‌లో ఉన్న ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. “ అటల్ బిహారీ వాజ్‌పాయ్ భారత ప్రధాని అయినప్పుడు , వారి వద్ద విదేశీ మారక నిల్వలు కేవలం ఒక బిలియన్ మాత్రమే. కానీ ఇప్పుడు భారత్ విదేశీ మారకం విలువ 600 బిలియన్ డాలర్లు. భారత్ ఎక్కడకు చేరింది. ప్రపంచం ముందు అడుక్కునే స్థితికి పాకిస్థాన్ ఎందుకు చేరుకుంది? అని షరీఫ్ ప్రశ్నించారు.

ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన షరీఫ్ , తన ఉద్వాసన వెనక నలుగురు న్యాయమూర్తులు , అప్పటి ఆర్మీ చీఫ్ జనరల్ కమర్ జావేద్ బజ్వాతోపాటు ఐఎస్‌ఐ చీఫ్ జనరల్ ఫయాజ్ హమీద్‌లు ఉన్నారని ఆరోపించారు. పాకిస్థాన్ ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణమైన ఈ అధికారులు జవాబుదారీని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీనే విజయం సాధిస్తుందని షరీఫ్ పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News